విజయ్ “వారసుడు” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే! |

0
66


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ వారసుడు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ గా ఈ చిత్రం జెమిని టీవీ లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం బుల్లితెర పై డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. జెమిని టీవీ లో ప్రసారం అయిన ఈ సినిమా 4.12 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here