లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్ డీటెయిల్స్ |

0
70శ్రీవిష్ణు హీరోగా రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సామజవరగమనా. యువ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మించారు. కాగా ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించారు. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, సుదర్శన, దేవీప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు.

జూన్ 29న విడుదలై మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాగా మౌత్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ అటు యుఎస్ఏ ఆడియన్స్ ని సైతం ఎంతో అలరిస్తోంది. కాగా ఇప్పటివరకు సామజవరగమనా మూవీ 700కె డాలర్స్ కొల్లగొట్టినట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. కాగా ప్రస్తుతం ఈ మూవీకి మంచి క్రేజ్ లభిస్తుండడంతో పాటు రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతుండడంతో అతి త్వరలో యుఎస్ఏ లో ఇది 1 మిలియన్ ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి రాబోయే రోజుల్లో సామజవరగమనా ఎంతమేర కొల్లగొడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here