“బ్రో” నుండి మై డియర్ మార్కండేయ రిలీజ్ కి రెడీ! |

0
66



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ బ్రో. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లోని ఫస్ట్ సింగిల్ అయిన మై డియర్ మార్కండేయ రిలీజ్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here