ఫైనల్ గా “గేమ్ చేంజర్” పై సాలిడ్ అప్డేట్.! |

0
67


గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్”.మరి సినిమా స్టార్ట్ అయ్యిన తర్వాత ఈసారి వచ్చిన గ్యాప్ నే చాలా ఎక్కువ కాగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా షూట్ సహా ఇతర అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. పైగా ఆ మధ్య అయితే మేకర్స్ పై నెగిటివ్ ట్రెండ్ కూడా చేశారు.

అయితే ఇక ఎట్టకేలకు ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ అయితే ఈ జూలై 10 లేదా 11 నుంచి రీస్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ షెడ్యూల్ లో అయితే శంకర్ పలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు సహా పలు ఇంపార్టెంట్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారట. అలాగే షెడ్యూల్ అంతా కూడా హైదరాబాద్ లోనే ప్లాన్ చేయబడింది అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here