ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్న సిద్ధార్థ్ “టక్కర్”.! |

0
65


టాలీవుడ్ లో ఒకప్పుడు షైన్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ రీసెంట్ గా నటించిన రోడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “టక్కర్”. కొత్త దర్శకుడు కార్తీక్ జి క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ అయితే హీరోయిన్ గా నటించింది. మరి తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రెండు భాషల్లో కూడా వైఫల్యం చెందింది.

ఇక ఫైనల్ గా అయితే ఇపుడు ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా వారు ఈ చిత్రాన్ని ఈ జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అప్పుడు వదిలేసి ఇప్పుడు చూడాలి అనుకునేవారు అయితే ఈ జూలై 7న నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలుగులో రిలీజ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here