ఆల్ టైం రికార్డు ధరకు షారుక్ ‘దున్కీ’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ? |

0
70


ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పఠాన్ మూవీ తో కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ఆయన చేస్తున్న మూవీ జవాన్. అలానే దానితో పాటు రాజ్ కుమార్ హిరానీ తో ఆయన వర్క్ చేస్తున్న మూవీ దున్కీ. ఈ రెండు సినిమాల పై షారుక్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం దున్కీ డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆ న్యూస్ ప్రకారం, ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ సంస్థ జియో సినిమా వారు దున్కీ ఓటిటి హక్కులని ఏకంగా రూ. 150 కోట్లకు దక్కించుకున్నారట. కాగా సింగిల్ లాంగ్వేజ్‌లో విడుదలయ్యే సినిమాకు ఇదే అత్యధిక డీల్ అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇక దున్కీ లో తాప్సీ పన్ను మరియు విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని 2023 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here